Rajolu | జోగులాంబ జిల్లాలో ఉద్రిక్తత.. ఇథనాల్ కంపెనీని వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన
Rajolu | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్లీ రైతులు ఆందోళన బాటపట్టారు.
Rajolu | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు ప్రారంభించేందుకు కంపెనీ ప్రయత్నించడంతో మళ్లీ రైతులు ఆందోళన బాటపట్టారు. ఈ క్రమంలో పలు గ్రామాలకు చెందిన రైతులు ఫ్యాక్టరీ వ్యతిరేక ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే ఫ్యాక్టరీ పనులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గాయత్రి ఇథనాల్ కంపెనీకి చెందిన కార్లు, టెంట్లను రైతులు ధ్వంసం చేశారు. పరిశ్రమకు చెందిన టెంట్లు, కంటైనర్ డబ్బాలకు రైతులు నిప్పు పెట్టారు.
కంపెనీ నిర్మాణ పనులు చేయిస్తున్న కూలీలను రైతులు తరిమికొట్టారు. ఆందోళన చేస్తున్న రైతులను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. రైతులు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారం ముందస్తుగా పోలీసులు సంఘటనా స్థలం పోలీసులు మోహరించినా.. రైతులు భారీ సంఖ్యలో ఉండడంతో వారిని పోలీసులు నిలువరించలేకపోయారు. కంపెనీకి చెందిన స్థలంలో ఉన్న వాహనాలను సైతం రైతులు ధ్వంసం చేశారు. మూడు నెలల కిందట కంపెనీ ఉండదని చెప్పిన యాజమాన్యం.. మళ్లీ పనులు మొదలుపెట్టేందుకు ఉపక్రమించడంతో పది గ్రామాల రైతుల ఆందోళన చేపట్టారు.

పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులను గుట్టు చప్పుడు కాకుండా కంపెనీ మళ్లీ ప్రారంభించింది. దాంతో మరోసారి రైతులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ వ్యతిరేక పోరుబాట పట్టడంతో మళ్లీ పెద్ద ధన్వాడ రణరంగంగా మారింది. కంపెనీ పనుల నేపథ్యంలో గ్రామ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోరాట కమిటీ సైతం సూచించింది. ఈ క్రమంలో మంగళవారం కీలక ప్రకటన సైతం విడుదల చేసింది. అర్ధరాత్రి ప్రజలంతా నిద్రలో ఉండగా.. దొంగల్లాగా ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం కంటైనర్లు, టిప్పర్లు, హిటాచీలను ప్రైవేటు సైన్యంతో పెద్దధన్వాడలోని నిర్మాణ స్థలంలోకి తీసుకువచ్చినట్లు కమిటీ పేర్కొంది.
గత ఆరునెలలుగా 12 గ్రామాల ప్రజలైన క్యాన్సర్ కారకాలు, విషాన్ని చిమ్మే పెట్టే ఫ్యాక్టరీని నిర్మించొద్దంటూ నిరసన నిరహార దీక్షలు కొనసాగించినట్లు పేర్కొంది. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ అలంపూర్ కాంగ్రెస్ ఇన్చార్జి సంపత్ కుమార్ హామీతో దీక్షలు విరమించామని గుర్తు చేసింది. అర్ధరాత్రి దొంగ దెబ్బ తీస్తారని ఊహించలేదని పేర్కొంది. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి, శాంతియుతంగా పోరాడుతున్న సమయంలో ప్రజలపై దాడి చేసేందుకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దురుద్దేశంతో ప్రైవేట్ సైన్యాన్ని మోహరిస్తూ ఫ్యాక్టరీ యాజమాన్యం ఏం కోరుకుంటుందని.. ప్రజల సహనాన్ని పరీక్షించడం దేనికి సంకేతమని ప్రశ్నించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

