హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): గత యాసంగికి సంబంధించిన 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి మళ్లీ టెండర్లు పిలవాలని ప్ర భుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొ న్నటి టెండర్లలో తక్కువ ధర రావడం తో వాటిని రద్దు చేసి పలుమార్పులతో మళ్లీ పిలిచింది. 7 నుంచి 17వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొంది. 20న ఫైనాన్షియల్ బిడ్‌ను ఓపెన్ చేయడంతోపాటు ఫార్వార్డ్ ఆక్ష న్ నిర్వహిస్తారు. ప్రస్తుత టెండర్ నోటిఫికేషన్లో భారీగా మార్పులతోపాటు నిబంధనలు సడలించారు. గత టెండర్లో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని లక్ష టన్నుల చొప్పున 25 లాట్లగా విభజించగా ఇప్పుడు దీనిని లాట్‌కు 15 వేల టన్నులకు తగ్గించారు. అప్పట్లో 25 లా ట్లు ఉండగా ఇప్పుడు వీటిని 167 లా ట్లకు పెంచారు. టెండర్లో పాల్గొనే వా రికి వరుసగా మూడేండ్లపాటు ప్రతి ఏటా రూ. 200 కోట్ల టర్నోవర్ ఉండాలని గతంలో నిబంధన ఉండగా ఇప్పు డు దీనిని రూ.10 కోట్లకు తగ్గించారు.