తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 18 : వివిధ రంగాలలో విశేష కృషి చేసిన 12 మంది తెలుగు రాష్ర్టాల ప్రముఖులకు పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ2021 ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్టు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్ తెలిపారు. వీరిలో గింజల నరసింహారెడ్డి(కవిత), తేరాల సత్యనారాయణ శర్మ (పరిశోధన), బీ నరహరి (చిత్రలేఖనం), డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి (శిల్పం), మేలట్టూర్ ఎస్ కుమార్ (నృత్యం), పీ పూర్ణచందర్ (సంగీతం), జీ వల్లీశ్వర్ (పత్రికారంగం), దెంచనాల శ్రీనివాస్(నాటకరంగం), వేద్మ శంకర్(జానపద కళారంగం), డాక్టర్ ముదిగొండ అమరనాధశర్మ(అవధానం), డాక్టర్ కొండపల్లి నిహారిణి(ఉత్తమ రచయిత్రి), డాక్టర్ జీ అమృలత (నవల,కథ)లకు పురస్కారాలను ప్రకటించినట్టు వివరించారు. త్వరలో వర్సిటీలో జరిగే కార్యక్రమంలో పురస్కార గ్రహీతలను రూ.20,116 చొప్పున నగదుతో సత్కరించనున్నట్టు పేర్కొన్నారు.