హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): మాతృభాష తెలుగు అమ్మ అయితే, హిందీ పెద్దమ్మ అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బాలయోగి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణ జయంతి వేడుకల్లో మాట్లాడారు. హిందీని వ్యతిరేకించడం అంటే రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని పేర్కొన్నారు. హిందీలో డబ్ అయిన 31% దక్షిణాది సి నిమాలు ఆదా యం తెచ్చిపెడుతున్నాయని గుర్తుచేశారు. వ్యాపారానికి హిందీ కావాలి కానీ, నేర్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే కొంతమంది హిందీని వ్యతిరేకిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. తెలుగుకు తాను వ్యతిరేకం కాదని, దేశ ప్రజలతో మాట్లాడేందుకు హిందీ నేర్చుకున్నానని తెలిపారు. మనమంతా ఒకటేనని హిందీని వ్యతిరేకిస్తున్న ప్రాంతాల వారికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.