‘పీఎం శ్రీ స్కూల్స్’కు 1,204 బడులు
ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్' పథకానికి తెలంగాణ నుంచి 5,973 స్కూళ్లు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు షార్ట్‌లిస్ట్ చేశారు.
- తెలంగాణనుంచి పోటీలో 5,973 స్కూళ్లు
- షార్ట్‌లిస్ట్ చేసిన రాష్ట్ర విద్యాశాఖ
- మండలానికి రెండు చొప్పున బడులు ఎంపికయ్యే అవకాశం
- దరఖాస్తు విధానంపై జిల్లా అధికారులకు నేడు ఓరియంటేషన్
హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడులను ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర విద్యాశాఖ అమలుచేస్తున్న ‘పీఎం శ్రీ స్కూల్స్’ పథకానికి తెలంగాణ నుంచి 5,973 స్కూళ్లు పోటీపడుతున్నాయి. ఆయా స్కూళ్లను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు షార్ట్‌లిస్ట్ చేశారు. ఈ పథకంలో భాగంగా మండలానికి రెండు చొప్పున 1,204 స్కూళ్లు ఎంపికయ్యే అవకాశముంది. స్కూళ్ల ఎంపిక సహా దరఖాస్తు విధానంపై జిల్లా అధికారులకు పాఠశాల విద్యాశాఖ సోమవారం ఓరియంటేషన్ నిర్వహించనున్నది. రాష్ట్రం నుంచి ప్రభుత్వ స్కూల్స్‌తోపాటు కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు కూడా ఈ పథకం కోసం పోటీపడనున్నాయి.
మూడు దశల్లో స్క్రీనింగ్
పాఠశాలలు ఆన్లైన్ పోర్టల్‌లో స్వయంగా దరఖాస్తు చేసుకోవాలి. ప్రాథమిక, ప్రాథమికోన్నత, సెకండరీ స్కూళ్లు పోటీపడొచ్చు. మూడు దశల ఎంపిక ప్రక్రియ తర్వాత స్కూళ్లను ఎంపికచేస్తారు. మండలానికి ఒక ప్రాథమిక, ఒక సెకండరీ/ సీనియర్ సెకండరీ స్కూల్ చొప్పున రెండు బడులను ఎంపికచేస్తారు. ఎంపిక, పర్యవేక్షణ కోసం పాఠశాలను జియోట్యాగింగ్ చేస్తారు. రాబోయే ఐదేండ్లలో రూ. 27,360 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చించనుండగా, కేంద్రం తన వాటాగా రూ.18,128 కోట్లు ఖర్చుచేయనున్నది. మొత్తం నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. ఈ పథకంలో భాగంగా బడులను హరిత పాఠశాలలుగా అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానళ్లు, ఎల్ఈడీ లైట్లు, ప్లాస్టిక్హ్రిత వ్యర్థ పదార్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, పోషకాహార తోటల పెంపకం, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపడుతారు.
మార్గదర్శకాలు
- దరఖాస్తు చేసే బడికి పటిష్ఠమైన పక్కా సొంత భవనం కలిగి ఉండాలి.
- పాఠశాలలో ఫైర్ సేఫ్టీ ఉపకరణాలు తప్పనిసరి.
- స్కూల్లో రాష్ట్ర సగటు కన్నా మించి స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఉండాలి.
- బాల బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల వసతి కలిగి ఉండాలి. కనీసం ఒక ప్రత్యేక టాయిలెట్ తప్పనిసరి.
- బడిలో పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఉండాలి.
- బడికి వినియోగంలో ఉన్న విద్యుత్తు కనెక్షన్.. విద్యుత్తు సరఫరా తప్పనిసరి
- పనిచేసే టీచర్లందరికి ఫొటో గుర్తింపుకార్డులు ఉండాలి.
- బడిలో గ్రంథాలయం లేదా రీడింగ్ కార్నర్, ఆటవస్తువులు తప్పనిసరి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

