Minor Driving | మైనర్ నడిపిన వాహనానికి ఏడాది రిజిస్ట్రేషన్ రద్దు.. 25 ఏండ్ల దాకా లైసెన్స్ కూడా ఇవ్వం.. రవాణా శాఖ వార్నింగ్
Minor Driving | ఆరేళ్ల చిన్నారితో ఓ ఎస్సై కారు డ్రైవింగ్ చేసిన ఘటన వైరల్ కావడంతో రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. మైనర్లతో వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది
Minor Driving | ఆరేళ్ల చిన్నారితో ఓ ఎస్సై కారు డ్రైవింగ్ చేసిన ఘటన వైరల్ కావడంతో రవాణా శాఖ తీవ్రంగా స్పందించింది. మైనర్లతో వాహనాలు నడిపిస్తే కఠిన చర్యలు తప్పవని మరోసారి హెచ్చరించింది. ఇటీవల ఓ మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడటంతో మోటార్ వెహికిల్ చట్టంలోని సెక్షన్ 199-ఏ(4) ప్రకారం సంబంధిత వాహనం రిజిస్ట్రేషన్‌ను ఏడాదిపాటు రద్దు చేసినట్లుగా ప్రకటించింది.
మైనర్లకు వాహనాలు నడిపేందుకు ఇవ్వవద్దని తల్లిదండ్రులు, సంరక్షకులకు రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది.
చట్టం ఏం చెబుతోంది
మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 199ఏ (2019 సవరణ) ప్రకారం మైనర్ వాహనం నడుపుతూ పట్టుబడితే ఆ వాహన యజమాని/సంరక్షకుడిని నేరస్తుడిగా పరిగణిస్తారు. వారికి చట్ట ప్రకారం శిక్ష విధించడంతో పాటు మైనర్ నడిపిన వాహన రిజిస్ట్రేషన్‌ను 12 నెలల పాటు రద్దు చేస్తారు. అలాగే మైనర్‌కు 25 ఏండ్లు వచ్చే దాకా డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయబడదు.
4070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు
గత ఆర్థిక సంవత్సరంలో మైనర్లకు వాహనాలు నడిపేందుకు అనుమతించిన కేసుల్లో రాష్ట్రవ్యాప్తంగా 4070 వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. పిల్లల భద్రత, ప్రజల భద్రత దృష్ట్యా మైనర్ పిల్లలకు వాహనాల తాళాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు, సంరక్షకులకు మరోసారి విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

