విద్యుత్తు శాఖ స్పెషల్ సీఎస్‌గా వికాస్‌రాజ్
కరెంట్ కోతలపై ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారులపైకి నెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
- పంచాయతీరాజ్ స్పెషల్ సీఎస్ నవీన్‌మిట్టల్
- జయేశ్ రంజన్‌కు మరింత అప్రాధాన్య పోస్టు
- 12 మంది సీనియర్ ఐఏఎస్‌ల బదిలీ
హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): కరెంట్ కోతలపై ప్రభుత్వ వైఫల్యాన్ని అధికారులపైకి నెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్‌ను బలి చేశారనే చర్చ జరుగుతున్నది. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా ఉన్న నవీన్‌మిట్టల్‌ను బదిలీ చేసి ప్రభుత్వం మరో సీనియర్ ఐఏఎస్ వికాస్‌రాజ్‌ను ఆ స్థానంలో నియమించింది. రాష్ట్రంలో మరో 12 మంది సీనియర్ ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ సంజయ్ జాజు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
- స్వచ్ఛంద ఉద్యోగ విరమణకు దరఖాస్తు చేసుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్‌రంజన్‌ను మరింత అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసింది. ప్రస్తుతం మెట్రోపాలిటిన్ ఏరియా అండ్ అర్బన్ డెలవప్మెంట్ (హెచ్ఎండీఏ లిమిట్స్) స్పెషల్ సీఎస్‌గా ఉన్న ఆయనను అటవీశాఖ స్పెషల్ సీఎస్‌గా బదిలీ చేసింది.
- రోడ్లు, భవనాల శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న వికాస్‌రాజ్‌ను బదిలీ చేసి విద్యుత్తుశాఖ స్పెషల్ సీఎస్‌గా నియమించింది. ఆయన స్థానంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తిని ట్రాన్స్పోర్ట్, ఆర్ అండ్ బీ సెక్రటరీగా నియమించింది. ఆయన పశు సంవర్థకశాఖ, డెయిరీ డెవలప్మెంట్ సెక్రటరీగానూ కొనసాగనున్నారు.
- ప్రస్తుతం పర్యాటకశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న వాణీప్రసాద్‌కు స్పోర్ట్ అండ్ డైరెక్టర్ హెరిటేజ్ తెలంగాణ స్పెషల్ సీఎస్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది.
- విద్యుత్తుశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న నవీన్ మిట్టల్‌ను బదిలీ చేసి పీఆర్, గ్రామీణాభివృద్ధి, ఆర్డబ్ల్యూఎస్, ఆర్ఎస్ఏడీ స్పెషల్ సీఎస్‌గా నియమించింది.
- ఈపీటీఆర్ఐ డీజీ శైలజారామయ్యర్‌ను బదిలీచేసి దేవాదాయ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించింది.
- ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్(ఎఫ్ఏసీ)గా ఉన్న సబ్యసాచి ఘోష్‌ను రిలీవ్ చేసిన ప్రభుత్వం ఆయన స్థానంలో ట్రైబల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా రాహుల్ బొజ్జాను నియమించింది. రాహుల్ బొజ్జా రెవెన్యూ(డిజాస్టర్ మేనేజ్మెంట్) ప్రిన్సిపల్ సెక్రటరీగా, బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీగానూ కొనసాగనున్నారు.
- మెట్రోపాలిటిన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ స్పెషల్ సీఎస్ జయేశ్‌రంజన్ స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్‌ను సెక్రటరీగా నియమించింది.
- మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శృతి ఓఝా, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణను నియమించింది.
- తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీని అదే బాధ్యతల్లో ఎఫ్ఏసీగా నియమించడంతో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నియమించింది.
- టీజీరెడ్కో ఎండీ బాధ్యతల నుంచి ముషారఫ్ అలీని తప్పించిన ప్రభుత్వం ఆయన స్థానంలో టీజీఎస్పీడీసీఎల్ ఎండీ జితీశ్ వీ పాటిల్‌ను నియమించింది.
దానకిశోర్ పదవీ కాలం పొడిగింపు…
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సీఎస్‌గా, గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా ఉన్న దానకిశోర్ ఉద్యోగకాలాన్ని పొడిగిస్తూ సీఎస్ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీచేశారు. అయితే ఉత్తర్వుల్లో కేవలం గవర్నర్ స్పెషల్ సీఎస్ పోస్టును మాత్రమే పేర్నొన్నది. ఎన్ని సంవత్సరాలపాటు పొడగిస్తున్నారనే విషయాన్ని ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.
ఇదిలా ఉంటే మరో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్‌కుమార్ సైతం ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయనున్నారు. అయితే ఆయనకు ఇప్పటివరకు ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. ఫార్ములా వన్ కేసులో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉద్యోగ విరమణకు రెండు రోజుల గడువు ఉన్నప్పటికీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ ఇవ్వకపోవడంపై సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
విద్యుత్తు శాఖకు రెండున్నరేండ్లలో ఐదుగురు బాస్‌లు
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులను పదేపదే మారుస్తూ ఆ రంగాన్ని అస్తవ్యస్తంగా మార్చుతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేండ్ల కాలంలో ఐదుగురు అధికారులను మార్చింది. మొదట విద్యుత్తుశాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రిజ్వీని బదిలీ చేసి సందీప్‌కుమార్ సుల్తానియాను నియమించింది.
ఆ తర్వాత కొద్ది నెలలకే ఆయనను బదిలీ చేసి రొనాల్డ్‌రోస్‌ను నియమించింది. ఆయనను కూడా బదిలీ చేసి నవీన్ మిట్టల్‌ను నియమించింది. ఇక ఏడాదిన్నర కూడా కాకుండానే మిట్టల్‌ను కూడా బదిలీ చేసి తాజాగా వికాస్‌రాజ్‌ను నియమించింది. ఈ పరిణామాలే ప్రస్తుత విద్యుత్తు సంక్షోభానికి కారణమవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

