హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర విద్యార్థుల నుంచి ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు త్వరలోనే తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్ (టీటీఎఫ్) నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. శుక్రవారం కంది ఐఐటీహెచ్‌లోని ఇన్వెంటివ్-2024 ఇన్నోవేషన్ ఫెస్ట్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. టీటీఎఫ్లో 50 శాతం తెలంగాణ విద్యార్థుల ప్రాజెక్ట్‌లను, 25 శాతం జాతీయంగా వివిధ సంస్థల ప్రాజెక్టులను, మరో 25 శాతం కంపెనీలు, ఇతర పరిశ్రమలు రూపొందించిన ప్రాజెక్ట్‌లను ప్రదర్శిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌తో భేటీ అయ్యారు. రూసా (పీఎం ఉషా) పెండింగ్ గ్రాంట్స్‌పై కేంద్ర మంత్రికి వివరించినట్టు తెలిసింది.