e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు ఎంపికైన గిరిజ‌న విద్యార్థి.. వ‌రంగ‌ల్ నిట్‌కు మ‌రొక‌రు

ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు ఎంపికైన గిరిజ‌న విద్యార్థి.. వ‌రంగ‌ల్ నిట్‌కు మ‌రొక‌రు

ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు ఎంపికైన గిరిజ‌న విద్యార్థి.. వ‌రంగ‌ల్ నిట్‌కు మ‌రొక‌రు

ఆదిలాబాద్ : IISC బెంగ‌ళూరు నిర్వ‌హించిన జాతీయ స్థాయి ప్ర‌వేశ ప‌రీక్ష‌లో ఇద్ద‌రు గిరిజ‌న విద్యార్థులు అర్హ‌త సాధించారు. ఒక‌రు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌కు ఎంపిక కాగా, మ‌రొక‌రు వ‌రంగ‌ల్ నిట్‌కు ఎంపిక‌య్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ప‌ట్నాపూర్ గ్రామానికి చెందిన అక్రె భ‌ర‌త్(21) భోద్‌లోని తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల డిగ్రీ క‌ళాశాల‌లో డిగ్రీ పూర్తి చేశాడు. ఆ త‌ర్వాత ఉన్న‌త చ‌దువుల కోసం IISC బెంగ‌ళూరు నిర్వ‌హించిన ఎమ్మెస్సీ – పీహెచ్‌డీ ప్రోగ్రామ్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసి అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచాడు. ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించ‌డంతో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో భ‌ర‌త్ కు సీటు ల‌భించింది. మ‌రో విద్యార్థి కుర్సెంగ సురేంద‌ర్ కూడా ఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌లో అర్హ‌త సాధించాడు. దీంతో అత‌నికి ఎమ్మెస్సీ మ్యాథ‌మేటిక్స్‌లో వ‌రంగ‌ల్ నిట్‌లో సీటు వ‌చ్చింది.

ఈ సంద‌ర్భంగా భ‌ర‌త్ మాట్లాడుతూ.. ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో సీటు రావ‌డం త‌న‌కెంతో సంతోషంగా ఉంద‌న్నారు. మ్యాథ‌మేటిక్స్‌లో ప్రొఫెస‌ర్‌గా రాణించాల‌నేది త‌న క‌ల అని చెప్పారు. త‌మ ప్రిన్సిపాల్ డాక్ట‌ర్ ఏ శ్రీనివాస్ స్వామి, టీచ‌ర్ల ప్రోత్సాహం వ‌ల్లే తాను ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్‌లో సీటు సాధించగ‌లిగాన‌ని భ‌ర‌త్ పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement