గురుకుల ఉద్యోగుల డీఏ బకాయిలు విడుదల చేయాలి
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి దాదాపు రూ.60 కోట్ల మేర పేరుకుపోయిన పాత డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం (టీజీఎస్డబ్లూఆర్ఈటీఎల్ఎ) ప్రభుత్వాన్ని అదివారం ప్రకటనలో డిమాండ్ చేసింది.
- టీజీఎస్డబ్లూఆర్ఈటీఎల్ఎ డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించి దాదాపు రూ.60 కోట్ల మేర పేరుకుపోయిన పాత డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఉద్యోగ ఉపాధ్యాయ అధ్యాపక సంఘం (టీజీఎస్డబ్లూఆర్ఈటీఎల్ఎ) ప్రభుత్వాన్ని అదివారం ప్రకటనలో డిమాండ్ చేసింది. ప్రభుత్వం డీఏ పెంపు ప్రకటించినప్పటికీ, ఉద్యోగులకు అందాల్సిన వ్యత్యాస మొత్తాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో అందకపోవడం శోచనీయమని సంఘం ఆవేదన వ్యక్తంచేసింది. బిల్లులు సిద్ధమై టోకెన్లు జనరేట్ కావడంతోపాటు, ఫైలు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి చేరినా నిధుల మంజూరులో జాప్యం కొనసాగడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తున్నదని పేర్కొన్నది. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపి, ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని వెంటనే నిధులు మంజూరయ్యేలా చూడాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆవుల సైదులు నర్సింహులు గౌడ్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యెనుగుల సంతోష్ కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

