బంగ్లాదేశ్‌లో గార్మెంట్ కార్మికుల ఆందోళన హింసాత్మకం
బంగ్లాదేశ్‌లో గార్మెంట్ పరిశ్రమ కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢాకా, గాజీపూర్ నగరాల్లో రహదారులను దిగ్బంధించారు.
- కనీస వేతనం రూ.23 వేలు చెల్లించాలంటూ డిమాండ్
- పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పు
ఢాకా : బంగ్లాదేశ్‌లో గార్మెంట్ పరిశ్రమ కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఢాకా, గాజీపూర్ నగరాల్లో రహదారులను దిగ్బంధించారు. నిరసనకారులు ఓ పోలీస్ ఔట్‌పోస్టుకు నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఇస్తున్న కనీస వేతనాన్ని నెలకు 30వేల బంగ్లాదేశ్ టాకాలకు (భారత కరెన్సీలో రూ.23వేలు) పెంచాలని డిమాండ్ చేశారు.
ఆందోళనకారుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కొత్త వేతన బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ నిరసనకారులు మరింతగా ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం బలగాలను రంగంలోకి దించింది. నిరసనకారులు మాత్రం వెనక్కు తగ్గేది లేదంటున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

