టీచర్ల హేతుబద్ధీకరణ ఉత్తర్వులు సవరించండి: టీపీటీఎఫ్
టీచర్ల హేతుబద్దీకరణ ఉత్తర్వులు సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీపీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పీఆర్సీ రిపోర్టు బహిర్గతం చేయాలని.. మెరుగైన ఫిట్మెంట్తో తెలంగాణ రెండో పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : టీచర్ల హేతుబద్దీకరణ ఉత్తర్వులు సవరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీపీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. పీఆర్సీ రిపోర్టు బహిర్గతం చేయాలని.. మెరుగైన ఫిట్మెంట్తో తెలంగాణ రెండో పీఆర్సీని వర్తింపజేయాలని కోరింది. రాష్ట్ర కమిటీ సమావేశాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి మాట్లాడుతూ.. టీచర్లను తరగతి గదికి దూరం చేసే ఆన్లైన్ కార్యక్రమాలు, ఇబ్బడిముబ్బడి టీచర్ల శిక్షణా కార్యక్రమాలు రద్దుచేయాలని డిమాండ్ చేశారు. మాడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలు అందజేయాలని కోరారు. సమావేశంలో పీ నాగిరెడ్డి, తిరుపతిరెడ్డి, ముత్యాల రవీందర్, నారాయణమ్మ, లక్ష్మయ్య, విజయ్, రమేశ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

