Secretarait | హైదరాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ) : సచివాలయం ఐదో ఫ్లోర్ సౌత్ భాగం పైకప్పు రేలింగ్ పట్టి కొంత ఊడిపోయింది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. రేలింగ్ పట్టి రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ వాహనంపై పడడంతో అది దెబ్బతిన్నది. అయితే ఈ ఘటనపై షాపూర్ జి పల్లోంజి(ఎల్ అండ్ టీ) నిర్మాణ సంస్థ స్పందించింది.
రెగ్యులర్ డిపార్ట్మెంట్ వర్స్లో భాగంగా కేబుల్, లైటింగ్ కోసం పనుల కోసం గోడలకు డ్రిల్ చేస్తున్నట్టు పేర్కొంది. డ్రిల్ చేయడం వల్ల జీఆర్ఎస్ ఫ్రేం డ్యామేజ్ అవుతుందని తెలిపింది. డ్రిల్ చేయడం వల్లే రేలింగ్ ఊడిపోయిందని వివరించింది. అయితే ఊడింది కాంక్రీట్ కాదని, స్ట్రక్చర్కు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టంచేసింది. నిర్మాణంలో ఎలాంటి నాణ్యతాలోపం లేదని పేర్కొంది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్టు వెల్లడించింది.