మహిళా సంఘాలకు 15 వేల కోట్ల రుణాలు
గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతి ఏడాది బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.12,655.10 కోట్ల రుణాలు ఇచ్చింది.
- 2022-23 లక్ష్యాన్ని నిర్దేశించిన సెర్ప్
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): గ్రామీణ ప్రాంత మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రతి ఏడాది బ్యాంక్ లింకేజీ రుణాలను ఇస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2021-22)లో మహిళా స్వయం సహాయక బృందాలకు రూ.12,655.10 కోట్ల రుణాలు ఇచ్చింది.
వాస్తవానికి 2,62,485 ఎస్‌హెచ్‌జీలకు రూ.12,046.39 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకొన్నప్పటికీ, అంతకుమించి 105.05 శాతం రుణాలు మంజూరు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 3,47,773 ఎస్‌హెచ్‌జీలకు రికార్డు స్థాయిలో రూ.15,001.42 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలు సిద్ధంచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సెర్ప్ సీఈవో సందీప్‌కుమార్ సుల్తానియా గురువారం ఆదేశాలు జారీచేశారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

