జీవో 168ను తక్షణమే రద్దు చేయాలి
రియల్ ఎస్టేట్ రంగంలోని చిన్న, సన్నకారు నిర్మాణదారులకు శరాఘాతంలా మారిన జీవో 168ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు.
- 3న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
- రియల్టర్స్ అసోసియేషన్ పిలుపు
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ) : రియల్ ఎస్టేట్ రంగంలోని చిన్న, సన్నకారు నిర్మాణదారులకు శరాఘాతంలా మారిన జీవో 168ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ తార్నాక కార్యాలయంలో మంగళవారం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ఈ నెల 29న అన్ని మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు సమర్పించాలని, నవంబర్ 3న మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు చేయాలని పిలుపునిచ్చా రు. వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలను విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ కోరింది.
ఈ సందర్భంగా రియల్టర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా రేగు శ్రీశైలం, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా మల్లేశ్ గౌడ్, ఫ్యూచర్‌సిటీ అధ్యక్షుడిగా రాజుగౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా శ్యామ్‌రావు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సాయిలు, వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పసుల రవీందర్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా మహంకాళి సురేశ్‌ను నియమించారు. అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా వనజ, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్‌రెడ్డిని నియమిస్తూ తీర్మానం చేశారు.
రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి : ట్రెసా
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రెవెన్యూ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల సమస్యను పరిష్కరించాలని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాను తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) కోరింది. ఈ మేరకు మంగళవారం ప్రతినిధి బృందం ఆయనను కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ కుమార్, ప్రధాన కార్యదర్శి రమన్ రెడ్డి మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న తహసీల్దార్ల వాహన అద్దె చార్జీలను వెంటనే విడుదల చేయాలని కోరారు. గత పార్లమెంట్ ఎన్నికల విధుల్లో పాల్గొన్న రెవెన్యూ ఉద్యోగులకు గౌరవ వేతన బిల్లులు సైతం పెండింగ్ ఉన్నాయని వాటిని వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో సమన్వయకర్త నారాయణ రెడ్డి, జాయింట్ సెక్రటరీ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

