హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించే అత్యుత్తమ రాష్ర్టాల్లో తెలంగాణ భారత దేశంలోనే తొలి ర్యాంక్‌లో నిలిచింది. గుజరాత్, కర్ణాటకలను తోసిరాజని తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్, వీ-హబ్, టీమ్ టీఎస్ఐసీ, టీవర్క్స్, ఆర్ఐసీహెచ్, ఏజీ హబ్ లాంటి వినూత్న సంస్థలతో వచ్చిన ఈ గుర్తింపు నాకు పెద్ద ఆశ్చర్యంగా అనిపించలేదు. చేయాల్సింది ఇంకా చాలా ఉంది’ అని ట్వీట్ చేశారు.