ఎర్రగడ్డ, అక్టోబర్ 10: తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ యూనియన్ (1535) ట్రాన్స్‌కో రాష్ట్ర నూతన అధ్యక్షుడుగా కళ్లెం శ్రీనివాస్‌రెడ్డి నియమితులయ్యారు. ఎర్రగడ్డకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి విద్యుత్తుసౌధలో అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం సీఎండీ రోనాల్డ్‌రోస్‌ను శ్రీనివాస్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పెద్దమ్మతల్లి చిత్ర పటాన్ని బహూకరించారు. సీఎండీని కలిసిన వాళ్లలో బండారి నగేశ్, రవి, ఆనంద్, సలీమ్, శ్రీనివాస్, ప్రమోద్లింగం ఉన్నారు.
ఇవి కూడా చదవండి
స్త్రీ నిధి ఎండీ పదవీ కాలం పొడిగింపు
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : స్త్రీ నిధి మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా విద్యాసాగర్‌రెడ్డి పదవీ కాలాన్ని పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2026 మే 23 వరకు ఆయనను ఎండీగా కొనసాగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
డిసెంబర్ 14న సీటెట్
హైదరాబాద్, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ) : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్) పరీక్ష షెడ్యూల్ మళ్లీ మారింది. తొలుత ఈ పరీక్ష డిసెంబర్ 1న జరగాల్సి ఉండగా.. డిసెంబర్ 15కు వాయిదావేశారు. ఆ రోజు ఇతర పరీక్షల నేపథ్యంలో ఒకరోజు ముందుకు జరిపి డిసెంబర్ 14న నిర్వహించాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) తాజాగా ప్రకటించింది.