DGP Anjani Kumar | హైదరాబాద్ : అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్( Badminton Championship )లో రాష్ట్ర పోలీసులకు పతకం వరించింది. డీసీపీ శ్రీ బాలా, అదనపు డీసీపీ నరసింహారెడ్డి జోడికి రజత పతకం లభించింది. ఈ సందర్భంగా శ్రీబాలా, నరసింహారెడ్డిని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్( DGP Anjani Kumar ) అభినందించారు.
ఫిబ్రవరి 20 నుంచి 26వ తేదీ వరకు చండీఘర్ వేదికగా 15వ అఖిల భారత పోలీసు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. శ్రీబాలా రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో రోడ్ సేఫ్టీ వింగ్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. నరసింహారెడ్డి సీపీఎస్‌లో అడిషనల్ డీసీపీగా పని చేస్తున్నారు.