హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల తుది రాత పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ని వెల్లడించినట్టు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఎస్ఎల్పీఆర్బీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఈ పరీక్ష కీని www.tslprb.in వెబ్సైట్లో ఉంచినట్టు తెలిపారు. దీనిపై అభ్యంతరాలుంటే ఈ నెల 24న సాయంత్రం 5 గంటలలోపు తెలుపాలని అభ్యర్థులను కోరారు. ప్రతి ప్రశ్నకు విడివిడిగా అభ్యంతరాలను సమర్పించాలని కోరారు. ఫైనల్ కీతో పాటు అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు స్కాన్ చేసి అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు.