ఖైరతాబాద్, నవంబర్ 13: అభివృద్ధి పనులు చేయమని అడిగినందుకు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడు బోర్గి సంజీవ్ ఆరోపించారు. గురువారం సాయంత్రం సోమాజిగూడలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జుక్కల్ మండలం వజర్కండి గ్రామానికి చెం దిన మాలి పాటిల్, మనోజ్ పాటిల్‌లు ఎమ్మెల్యేను దూషించారంటూ బిచ్కుందకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యా దు చేస్తే, ఎలాంటి విచారణ చేపట్టకుం డా వారిపై అట్రాసిటి కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. దీనిపై జిల్లా ఎస్పీ తక్షణమే విచారణ జరిపించాలని ఆదేశించినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో హైకోర్టు, సుప్రీంకోర్టులలో రిట్ పిటిషన్లు దాఖలు చేయను న్నట్టు ఆయన వెల్లడించారు.