2 లక్షల మందికి సాయం

- ప్రైవేటు టీచర్లకు నగదు, బియ్యం పంపిణీ
- అండగా సీఎం కేసీఆర్: మంత్రి సబితారెడ్డి
హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని రెండు లక్షల మందికిపైగా ప్రైవేటు స్కూ ల్ టీచర్లు, సిబ్బందికి రెండునెలల సాయాన్ని విజయవంతంగా అందజేసినట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి వెల్లడించారు. 2 వేల నగదుతోపాటు 25 కిలోల బియ్యాన్ని లబ్ధిదారులందరికీ అందజేశామని మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆపత్కాల సాయానికి 2,04,743 మంది లబ్ధిదారులను ఎంపికచేయగా.. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన దాదాపు రూ.81.90కోట్ల నగదు, రూ.38.77 కోట్ల విలువైన 10,237 టన్నుల బియ్యాన్ని అందజేశామని చెప్పారు. కరోనా కారణంగా పాఠశాలల మూసివేతతో ప్రైవేటు టీచర్లకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలిచారని పేర్కొన్నారు. ఇకనుంచి ప్రతినెలా రూ.40.94 కోట్ల నగదుతోపాటు రూ.19.38 కోట్ల విలువైన 5,118 టన్నుల బియ్యాన్ని అందజేస్తామని సబితాఇంద్రారెడ్డి ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

