హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ): తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం షెడ్యూల్ విడుదల చేశారు.
జూలై 28 నుంచి ఆగస్టు 5 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఆగస్టు 6 నుంచి 10 వరకు రూ.25, ఆగస్టు 11 నుంచి 15 వరకు రూ.50 ఫైన్‌తో, ఆగస్టు 16 నుంచి 18 వరకు తత్కాల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.