439 కోట్లతో బడులకు రంగులు
- గ్రీన్ చాక్‌పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్, ఫర్నిచర్ సరఫరాకు మరో 396 కోట్ల వ్యయం
- మన ఊరు.. మన బస్తీ- మన బడి పనులకు గ్లోబల్ టెండర్లు..
- ఆఖరు తేదీ ఈ నెల 17
- 9,123 బడులకు పంపిణీకి గడువు ఏడాది
హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): ప్రతిష్ఠాత్మక ‘మన ఊరు మన బడి -మన బస్తీ..మన బడి’లో పాఠశాలల పెయింటింగ్‌కు రూ.439 కోట్లను వెచ్చించనున్నారు. ఈ నిధులతో మొదటి విడతలో 9,123 బడుల రూపురేఖలను మార్చనున్నారు. రంగులను సేకరించేందుకు విద్యాశాఖ అధికారులు ఇటీవలే గ్లోబల్ టెండర్లు ఆహ్వానించారు. రంగులతోపాటు, గ్రీన్ చాక్‌పీస్ బోర్డులు, డ్యూయల్ డెస్క్ బల్లలు, ఫర్నిచర్ సేకరణకు టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 17 వరకు టెండర్ల దాఖలకు అవకాశముండగా, మొత్తం పనులు 12 మాసాల్లో పూర్తికావాలని గడువు విధించారు. రాష్ట్రంలో మొత్తం 1,39,585 తరగతి గదులుండగా, తొలి విడతలో 71,115 తరగతి గదులకు రంగులు వేయాలని అధికారులు నిర్ణయించారు. గోడలు, సీలింగ్, తలుపులు, కిటికీలు, గ్రిల్స్, గేట్స్, టాయిలెట్లు సహా అన్నింటికీ రంగులేస్తారు. ఈ రంగులు కనీసం ఏడేండ్ల పాటు ఉండాలని గడువు విధించారు. ఇవి పూర్తయిన తర్వాత పాఠ్యాంశాలపై అవగాహన కల్పించేలా సౌర కుటుంబం, తెలుగు, ఆంగ్ల, అక్షరమాల తదితర పెయింటింగ్స్ వేయిస్తారు. రూ.219 కోట్లతో 2.08 లక్షల డ్యూయల్ డెస్క్ బల్లలను సేకరించనున్నారు. రూ.106 కోట్లతో గ్రంథాలయాలు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్, టీచర్లు, హెడ్మాస్టర్లకు కావాల్సిన 3.26 లక్షల టేబుళ్లు, కుర్చీలను సేకరిస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

