లోక్ అదాలత్‌లో 1,51,164 కేసులు పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వీటిలో మోటర్ వాహన చట్టం కింద నమోదైన 62,969 కేసులు, 61,052 పెట్టీ కేసులు, 3,896 సైబర్ క్రైమ్ కేసులు, 1,404 డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఉన్నాయని తెలిపారు.
- సైబర్ నేరాల్లో 3,896 మంది బాధితులకు రూ.42.28 కోట్ల రీఫండ్: సీఐడీ డీజీ చారుసిన్హా
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా ఈ నెల 3 నుంచి 12 వరకు రాష్ట్రంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మొత్తం 1,51,164 కేసులు పరిష్కారమయ్యాయని సీఐడీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. వీటిలో మోటర్ వాహన చట్టం కింద నమోదైన 62,969 కేసులు, 61,052 పెట్టీ కేసులు, 3,896 సైబర్ క్రైమ్ కేసులు, 1,404 డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు ఉన్నాయని తెలిపారు.
మరో 21,843 కేసులు రాజీ అయ్యాయని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరాల బాధితులకు రూ.42.28 కోట్లు రీఫండ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు 73,204 మంది బాధితులకు రూ. 514.93 కోట్లు రీఫండ్ చేశామని వెల్లడించారు. ఇందులో ఈ ఏడాది 24,189 మంది బాధితులకు రూ.139.68 కోట్లు రీఫండ్ చేశామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

