హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లోని మంత్రి చాంబర్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పీఆర్సీ, ఈపీఎఫ్, జీపీఎఫ్, ఆర్టిజన్లు తదితర సమస్యలపై మంత్రితో జాక్ ప్రతినిధులు చర్చించారు. రెండు, మూడు రోజుల్లో సీఎండీలతో చర్చించి, ఆయా సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబు, కన్వీనర్ రత్నాకర్‌రావు, కో చైర్మన్ శ్రీధర్, కో-కన్వీనర్ బీసీరెడ్డి, గోవర్ధన్, రమేశ్, వెంకన్నగౌడ్, సుధాకర్‌రెడ్డి, తులసి నాగ రాణి, కరుణాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, సదానందం, నాగరాజు, అంజయ్య, కిరణ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.