బుధవారం 20 జనవరి 2021
Telangana - Dec 03, 2020 , 20:45:18

ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం: సీఎం కేసీఆర్

ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం: సీఎం కేసీఆర్

హైదరాబాద్‌: నెక్లెస్‌ రోడ్‌లోని హెచ్‌ఎండీఏ మైదానంలో రాష్ట్ర సహాయ సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శన-2020ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యా దేవరాజన్‌, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ శైలజ, టీఎస్‌ఐసీ సీఈవో, టీహబ్‌ సీఈవో రవి నారాయణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

'వ్యవసాయంలో ఆధునిక సాంకేతికత ఉపయోగించుకోవాలి. దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌ తెలంగాణలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం ఎంత వినియోగించుకుంటే అంత ముందుకెళ్తాం. సీఎం కేసీఆర్‌ ఎప్పుడూ టెక్నాలజీ ఉపయోగకరంగా ఉండాలని చెప్తుంటారు. సాంకేతిక మానవాళికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత. ప్రజలకు ఉపయోగపడితేనే టెక్నాలజీకి పరమార్థం.  ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ప్రత్యేకమైనదని' కేటీఆర్‌ పేర్కొన్నారు. 


logo