దేవరుప్పుల, ఏప్రిల్ 15: బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా ధాన్యం కొంటున్నారా? అని పం చాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. కేంద్రం సహకరించకున్నా రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి వడ్లు కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టంచేశారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం జక్కల్‌దాని తండా, నస్రుల్లాబాద్‌లో కొనుగోలు కేంద్రాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌తో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ సొసైటీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే షకీల్, ధర్పల్లిలో సొసై టీ కొనుగోలు కేంద్రాన్ని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి ప్రారంభించారు. నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని ఆర్జాలబావిలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మిర్యాలగూడ మండలం అవంతీపురం వ్యవసాయ మార్కెట్లో కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్‌రావు ప్రారంభించారు.