CPGET 2025 | హైదరాబాద్ : రాష్ట్రంలోని తొమ్మిది యూనివర్సిటీల్లో ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఉస్మానియా యూనివర్సిటీ సీపీగెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సీపీగెట్ ఫలితాలను సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి విడుదల చేయనున్నారు. ఈ ఫలితాల విడుదలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు 6 నుంచి 11 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు 45,477 మంది హాజరైనట్టు అధికారులు వెల్లడించారు.
ఉస్మానియా, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, కాకతీయ, చాకలి ఐలమ్మ, జేఎన్టీయూ యూనివర్సిటీల్లో 32 సబ్జెక్టుల్లో ప్రవేశాలకు సీపీగెట్ నిర్వహించారు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ తప్పనిసరి. ఫలితాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి. https://cpget.tgche.ac.in/