‘ఏడీఆర్’ ఎండీ, ముగ్గురు సబ్రిజిస్ట్రార్లకు జైలు శిక్ష
కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించిన ఏడీఆర్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ దామోదర్‌రావుతోపాటు ఆ పత్రాలను అనుమతించి రిజిస్ట్రేషన్లను కొనసాగించిన కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ పీ శ్రీను, జాయింట్ సబ్రిజిస్ట్రార్లు వీ అశోక్, పీ మధుబాబుకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది.
- కోర్టు ధిక్కరణ కేసులో హైకోర్టు తీర్పు
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ పత్రాలను సమర్పించిన ఏడీఆర్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ దామోదర్‌రావుతోపాటు ఆ పత్రాలను అనుమతించి రిజిస్ట్రేషన్లను కొనసాగించిన కుత్బుల్లాపూర్ సబ్‌రిజిస్ట్రార్ పీ శ్రీను, జాయింట్ సబ్రిజిస్ట్రార్లు వీ అశోక్, పీ మధుబాబుకు హైకోర్టు 6 నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధించింది.
రంగారెడ్డి జిల్లా బాచుపల్లి సర్వే నంబర్ 140లోని భూవివాదానికి సంబంధించి 2023 ఫిబ్రవరిలో వెలువడిన ఉత్తర్వులను ఉల్లంఘించారంటూ ఏపీలోని గుడివాడకు చెందిన చలసాని కల్యాణిలీల కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేయడంతో జస్టిస్ కే లక్ష్మణ్, జస్టిస్ ఎన్ తుకారాంజీలతో ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పుపై అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ శిక్ష అమలును 4 వారాలపాటు నిలిపివేసింది. కాగా, ఇదే వ్యవహారంలో ప్రతివాదులుగా ఉన్న స్టాంపుల శాఖ ఐజీ, జిల్లా రిజిస్ట్రార్‌పై కోర్టు ధికరణ కేసును కొట్టివేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

