బెంగాల్లో ఈసీ టార్గెట్ ముస్లిం ఓటర్లే!
న్యాయాధికారులు అర్హులుగా గుర్తించినప్పటికీ భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని చూస్తున్న పశ్చిమ బెంగాల్ ఓటర్లలో ప్రతి 10 మందిలో 9 మంది కి ముస్లిం పేర్లు ఉన్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ముస్లిం మెజారిటీ సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా, హిందూ మెజారిటీ జిల్లాల్లో కూడా కనిపిస్తున్నది.
- తొలగించిన 10 పేర్లలో 9 మంది ముస్లింలే
- 16,08,175 మందికి వ్యతిరేకంగా దాఖలైన అప్పీళ్లు
- 14,39,797 మంది ముస్లిం ఓటర్ల మెడపై ఈసీ కత్తి
కోల్‌కతా, నవంబర్ 9: న్యాయాధికారులు అర్హులుగా గుర్తించినప్పటికీ భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని చూస్తున్న పశ్చిమ బెంగాల్ ఓటర్లలో ప్రతి 10 మందిలో 9 మంది కి ముస్లిం పేర్లు ఉన్నాయి. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ముస్లిం మెజారిటీ సరిహద్దు ప్రాంతాల్లోనే కాకుండా, హిందూ మెజారిటీ జిల్లాల్లో కూడా కనిపిస్తున్నది. సివిక్ రిసెర్చ్ గ్రూప్ సంకలనం చేసిన అప్పీల్ రికార్డుల ప్రకారం ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) సమయంలో న్యాయమూర్తులు అర్హులుగా ప్రకటించిన ఓటర్లను చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ 16,08,175 అప్పీళ్లు దాఖలయ్యాయి. వారిలో కనీసం 14,39,797 మంది అంటే 89.5 శాతం మందికి ముస్లిం పేర్లు ఉన్నాయని ‘ది వైర్’ జరిపిన ఓటర్ల పేర్ల విశ్లేషణలో తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పశ్చిమ బెంగాల్ జనాభాలో ముస్లింలు 27 శాతం మంది ఉన్నారు. అలాగే రాష్ట్రంలోని ఓటర్లలో వీరు సుమారు 29 శాతం ఉన్నారు.
అన్ని సీట్లలో ఒకే తీరు
మైనారిటీ జనాభా వాటా ఆధారంగా నియోజకవర్గాలను వర్గీకరించడం ద్వారా మైనారిటీ ఓటర్లు తమ చుట్టూ ఉన్న జనాభా నుంచి ఎంత వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారో ఈ లెక్కలు తెలుపుతాయి. జనాభాలో ముస్లింలు సుమారు 6 శాతం ఉన్న నియోజకవర్గాలలో వ్యతిరేకంగా అప్పీల్ చేసిన ప్రతి 10 మంది ఓటర్లలో ఆరుగురి కంటే ఎక్కువ మందికి ముస్లిం పేర్లు ఉన్నాయి. ఇది వారి జనాభా కంటే దాదాపు పది రెట్లు ఎక్కువ. మైనారిటీలు సుమారు 15 శాతం ఉన్న నియోజకవర్గాలలో ఈ సంఖ్య 10 పది మందిలో 8 కంటే ఎక్కువగా ఉంది. 137 నియోజకవర్గాలలో అభ్యంతరాలు దాఖలైన ఓటర్లలో కనీసం 90 శాతం మందికి ముస్లిం పేర్లు ఉన్నాయి. ముస్లిం జనాభా ఐదవ వంతు కంటే తక్కువగా ఉన్న 160 నియోజకవర్గాల విషయానికి వస్తే వీటిలో 69 నియోజకవర్గాల్లో అభ్యంతరాలు ఎదుర్కొంటున్న వారిలో కనీసం 80 శాతం మంది ముస్లిం పేర్లు కలిగిన వారే ఉన్నారు. ఈ 160 నియోజకవర్గాల పరిధిలో ముస్లిం పేర్లు కలిగిన మొత్తం 2,62,416 మంది ఓటర్లు ఇటువంటి అభ్యంతరాలను ఎదుర్కొంటున్నారు. ఈ వ్యత్యాసం ముస్లింలు తక్కువగా నివసించే జిల్లాల్లోనే అత్యధికంగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

