ఈ నెల 13న యుగాంతం ?
మూడు రోజుల్లో ప్రపంచం అంతం కాబోతున్నదా? 1960 నాటి జోస్యం నిజమవుతుందా? అనే విషయాలు తాజాగా చర్చనీయాంశం అయ్యాయి. జనాభా పెరిగిపోతే, ప్రజలకు తగినంత ఆహారాన్ని అందించే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగబోవని, ఆకలి చావులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు 1960వ దశాబ్దంలో ఆందోళన వ్యక్తం చేశారు. “డూమ్స్‌డే : ఫ్రైడే 13 నవంబర్ 2026” శీర్షికతో ‘సైన్స్'లో ప్రచురితమైన వ్యాసంలో, 2026 నవంబర్ 13నాటికి మానవ జనాభా అనంతం అవుతుందని ప్రొఫెసర్ హీంజ్ వోన్ ఫోర్స్టెర్ బృందం చెప్పింది.
- శాస్త్రవేత్తలు 1960, 1964లలో వేసిన అంచనాలు నిజమవుతాయా?
- ఆశాజనకంగా ప్రస్తుత పరిస్థితులు
న్యూఢిల్లీ: మూడు రోజుల్లో ప్రపంచం అంతం కాబోతున్నదా? 1960 నాటి జోస్యం నిజమవుతుందా? అనే విషయాలు తాజాగా చర్చనీయాంశం అయ్యాయి. జనాభా పెరిగిపోతే, ప్రజలకు తగినంత ఆహారాన్ని అందించే స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరగబోవని, ఆకలి చావులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు 1960వ దశాబ్దంలో ఆందోళన వ్యక్తం చేశారు. “డూమ్స్‌డే : ఫ్రైడే 13 నవంబర్ 2026” శీర్షికతో ‘సైన్స్’లో ప్రచురితమైన వ్యాసంలో, 2026 నవంబర్ 13నాటికి మానవ జనాభా అనంతం అవుతుందని ప్రొఫెసర్ హీంజ్ వోన్ ఫోర్స్టెర్ బృందం చెప్పింది.
జనాభా ఎంత వేగంగా పెరిగినప్పటికీ, ఫుడ్ టెక్నాలజీ, ఇండస్ట్రియల్ సైన్స్ కూడా అదే వేగంతో అభివృద్ధి చెందుతాయని ఫోర్స్టెర్ వాదించారు. ఆయన గణిత సూత్రాల ఆధారంగా డూమ్స్డేను లెక్కించగా, జియాలజిస్ట్ డాక్టర్ మైఖేల్ టెక్లా మాత్రం సూర్యుడి నుంచి మునుపెన్నడూ లేనంత తీవ్రమైన శక్తి 2026 నవంబర్ 13న విడుదలవుతుందని, భూమి అయస్కాంత క్షేత్రంలో తీవ్రమైన అంతరాయాలు ఏర్పడతాయని, ఫలితంగా భూమిపై విపరీతమైన విధ్వంసం జరుగుతుందని చెప్పారు.
3 కారణాలు ఆశాజనకం
13వ తారీఖు వచ్చేస్తోందనే ఆందోళన అక్కర్లేదని చెప్పడానికి 3 కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఫోర్స్టెర్ కేవలం గణిత సూత్రాన్ని మాత్రమే చెప్పారు. ప్రస్తుతం అది నిజమవడం అసాధ్యం. రెండో కారణం ఏమిటంటే, డాక్టర్ మైఖేల్ చెప్పినదాంట్లో చాలా లోపాలు ఉన్నాయి. సూర్యుడిలో తరచూ అసాధారణ కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. కేవలం ఒక రోజులో మొత్తం భూమిని నాశనం చేసే స్థాయిలో అవి ప్రమాదకరం కాదు. మూడో కారణం ఏమిటంటే, విశ్వాన్ని శాటిలైట్స్ నిరంతరం గమనిస్తూ ఉంటాయి. ఏదైనా అసాధారణమైన ఖగోళ సంఘటన జరగబోతూ ఉంటే, దానిని ముందుగానే గుర్తించవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

