బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బెయిలు రద్దుపై హైకోర్టు తీర్పు వాయిదా
రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న అభియోగాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు టీ మధుసూదన్, ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డికి కింది కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలన్న సైఫాబాద్ పోలీసుల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది.
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కులం పేరుతో దూషించారన్న అభియోగాల కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు టీ మధుసూదన్, ఎన్ నవీన్‌కుమార్‌రెడ్డికి కింది కోర్టు మంజూరు చేసిన బెయిలును రద్దు చేయాలన్న సైఫాబాద్ పోలీసుల పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ ముగిసింది. స్పీకర్‌పై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే నిందితులపై కేసు నమోదైందని పోలీసుల తరఫున పీపీ పల్లె నాగేశ్వరరావు తెలిపారు.
ఈ కేసు తీవ్రతను పరిశీలించకుండానే మెజిస్ట్రేట్ బెయిలు మంజూరు చేశారని, దీంతో బెయిలు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీల తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదనలు వినిపిస్తూ.. స్పీకర్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కులం పేరుతో దూషించారన్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అసెంబ్లీలోకి అనుమతించకుండా అడ్డుకోవడంతో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న తప్పుడు ఆరోపణలు తెరపైకి వచ్చాయని తెలిపారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ వ్యవహారంలో పోలీసులపై చర్యలు చేపట్టాలని హైకోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీచేసిందని గుర్తుచేశారు. ఆ పరిణామాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎమ్మెల్సీలకు మంజూరైన బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు కోరడం సమంజసం కాదని పేర్కొన్నారు. విపక్ష నేతలను రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలనే ఆ పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తిచేశారు. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో హైకోర్టు తీర్పును వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

