ఎల్-1 బిడ్డర్‌ను ప్రతివాదిగా చేర్చండి
కొత్వాల్‌గూడ (బుద్వేల్) వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి వరకు చేపట్టనున్న 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 నిర్మాణ కాంట్రాక్టులో ఎల్-1 బిడ్డర్‌ను ప్రతివాదిగా చేయాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది.
- రేడియల్ రోడ్డు-2 నిర్మాణంపై పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : కొత్వాల్‌గూడ (బుద్వేల్) వద్ద ఔటర్ రింగ్ రోడ్డు నుంచి నాచారం వద్ద జాతీయ రహదారి వరకు చేపట్టనున్న 81.15 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు-2 నిర్మాణ కాంట్రాక్టులో ఎల్-1 బిడ్డర్‌ను ప్రతివాదిగా చేయాలని హైకోర్టు పిటిషనర్‌ను ఆదేశించింది. ఇప్పటికే ఈ కాంట్రాక్టుకు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక బిడ్లను తెరవడంతో అర్హత సాధించిన ఎల్-1 బిడ్డర్ వాదనలు వినాల్సి ఉన్నదని స్పష్టం చేసింది. టెండరు సాంకేతిక అర్హత ధ్రువీకరణకు సంబంధించి ప్రభుత్వం కౌంటర్లు దాఖలు చేయకముందే ఆ టెండరును నిలిపివేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) చేపట్టిన రేడియల్ రోడ్డు-2 పనుల టెండరు సాంకేతిక బిడ్‌లో తనను అనర్హురాలిగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో సుశీ ఇన్ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ దాకలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మరోసారి విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. అనుభవ ధ్రువీకరణ నిమిత్తం సమర్పించిన సర్టిఫికెట్‌ను సరిగా పరిశీలించకుండానే ‘సుశీ ఇన్ఫ్రా’ను అనర్హురాలిగా ప్రకటించారని చెప్పారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఇటానగర్ రోడ్డు రవాణా సంస్థ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ రీజినల్ కార్యాలయం సూపరింటెండెంట్ ఇంజినీర్ తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సంతకం చేశారని, అకడ పిటిషనర్ రూ.1,500 కోట్లకుపైగా విలువైన పనులు చేపట్టారని వివరించారు. దరఖాస్తు పరిశీలన సమయంలో అనుభవ ధ్రువీకరణ పత్రాలపై సందేహాలు తలెత్తితే టెండరు నిబంధనల ప్రకారం స్పష్టత తీసుకోవాల్సి ఉన్నదని తెలిపారు. పిటిషనర్ కంటే ఎల్-1 బిడ్డర్ రూ.600 కోట్లకు అధికంగా బిడ్ వేశారని, దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని పేర్కొన్నారు. రేడియల్ రోడ్డు-2 కాంట్రాక్టు ఖరారుకు ముందే తాము లంచ్ మోషన్ పిటిషన్ ద్వారా హైకోర్టును ఆశ్రయించామని గుర్తుచేశారు. అంతేకాకుండా ఆ కాంట్రాక్ట్‌ను ఖరారు చేసినప్పటికీ కోర్టు తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకు ఎలాంటి న్యాయపరమైన హకులు కోరజాలరని న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చిందని గుర్తుచేశారు.
ఈ నేపథ్యంలో కాంట్రాక్టును అప్పగించామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కోర్టు జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అనంతరం అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ వ్యాజ్యం దాఖలు చేయకముందే ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక బిడ్లు తెరిచి ఎల్-1 బిడ్డర్‌ను అర్హురాలిగా ప్రకటించిందని తెలిపారు. కాంట్రాక్టు ఎవరికి అప్పగించాలన్నది అధికారుల పరిధిలోని అంశమని, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే పలు తీర్పులు వెలువరించిందని పేర్కొన్నారు. టెండరు ప్రక్రియ నిర్వహణలో అధికారులపై పిటిషనర్ ఎలాంటి దురుద్దేశపూరిత ఆరోపణలు చేయలేదని, కేవలం సాంకేతిక అర్హతలు లేకపోవడంతో పిటిషనర్ బిడ్ తిరసరణకు గురైందని చెప్పారు. రూ.600 కోట్ల అదనపు భారాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని, దానితో పిటిషనర్‌కు సంబంధంలేదని తెలిపారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. ఈ వ్యవహారంపై కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. పిటిషనర్ చెప్తున్న సాంకేతిక అర్హత ధ్రువీకరణ పత్రం చెల్లుతుందో లేదో కౌంటర్ దాఖలు చేసిన తర్వాత తేలుస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ కౌంటర్‌ను, ఎల్-1 బిడ్డర్ వాదనను పరిగణనలోకి తీసుకోకముందే రేడియల్ రోడ్డు-2 టెండర్ రద్దుకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంటూ.. తదుపరి విచారణను 29కి వాయిదా వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

