MLC By Election | నల్లగొండ ప్రతినిధి, జూన్ 5 (నమస్తే తెలంగాణ): వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికల కౌంటింగ్ సుదీర్ఘంగా కొనసాగనున్నది. నల్లగొండ శివారులోని దుప్పలపల్లి స్టేట్ వేర్‌హౌస్ కార్పొరేషన్ గోదాముల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటిం గ్ ప్రక్రియలో తొలిరోజు బండిల్స్ కట్టడానికే ఎకువ సమయం తీసుకున్నది.
మొత్తం నాలుగు కౌంటింగ్ హాళ్లలోని 96 టేబుళ్లపై ముందుగా పోలింగ్ బాక్స్లవారీగా బ్యాలెట్ పత్రాలు తెచ్చి కట్టలు కట్టారు. 25 బ్యాలెట్లను ఒక కట్ట చొప్పున మొత్తం 3,66,013 ఓట్లను కట్టలుగా విభజించారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇదే కొనసాగింది. సాయంత్రం 4 గంటల నుంచి తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కిం పు మొదలుపెట్టారు.
నాలుగు రౌండ్లలో తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు కొనసాగనున్నది. తొలి రౌండ్ లెక్కింపునకే ఆరు గంటలకుపైగా సమయం తీసుకున్నది. దాంతో అధికార ఫలి తం రాత్రి 11 గంటల వరకు కూడా వెలువడలేదు. తొలి రౌండ్లో మొత్తం 96 టేబుల్స్‌పై టేబుల్‌కు వెయ్యి చొప్పున 96,000 ఓట్ల లెకింపు చేపట్టారు. ఒక రౌండ్ కౌంటింగ్ రెండు గంటల్లో పూర్తవుతుందని అధికారులు భావించారు. కానీ, అనుకున్న సమయానికంటే మూడు రెట్ల సమయం అదనంగా పడుతున్నది.
దీన్ని బట్టి తొలి ప్రాధాన్యం ఓట్ల నాలుగు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి గురువారం మధ్యాహ్నం 12 గంటలు కావచ్చని అంచనా. తొలి ప్రాధాన్యం ఓట్ల లెక్కిం పు అనంతరం చెల్లని ఓట్లను తీసివేసి చెల్లిన ఓట్ల నుంచి 50 శాతం ప్లస్ ఒకటిని గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. ఈ గెలుపు కోటాను తొలి ప్రాధాన్యం ఓట్లలో ఎవరూ సాధించకపోతే తర్వాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థి నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెడతారు. ఇదే జరగాల్సి వస్తే రేపు ఉదయానికిగానీ తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం లేదు.
హోరాహోరీ పోరు
బుధవారం రాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. తొలి ప్రాధాన్యం ఓట్ల తొలి రౌండ్ లెక్కింపులో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. నువ్వా-నేనా అన్నట్టు ఆయా టేబుళ్లపై పోలవుతున్న ఓట్ల సరళి స్పష్టం చేస్తున్నది.
మొత్తం నాలుగు హాళ్లలో కౌంటింగ్ జరుగుతుండగా రెండుహాళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థికి కొంచెం ఎడ్జ్ కనిపిస్తే.. మరో రెండు హాళ్లలో కాంగ్రెస్ అభ్యర్థికి ఎడ్జ్ కనిపిస్తున్నది. మూడు, నాలుగు స్థానాల కోసం బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌గౌడ్ మధ్య టఫ్ ఫైట్ సాగుతున్నట్టు సమాచారం. గురువారం ఉదయానికి ఫలితాల సరళిని అంచనా వేయవచ్చని అభ్యర్థులు భావిస్తున్నారు.