RTC Employees | హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. జూన్ 1 నుంచి కొత్త ఫిట్మెంట్ అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. కొత్త ఫిట్మెంట్తో ఆర్టీసీపై నెలకు రూ. 35 కోట్ల భారం పడనుందని తెలిపారు. 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుందని మంత్రి స్పష్టం చేశారు.