I&PR Jobs | రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలోని సమాచార, పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా పోస్టులను పొరుగు సేవల పద్దతిలో నియమించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల నియామకం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే ప్రతి జిల్లాలో ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ తన నోటిఫికేషన్లో పేర్కొంది.