KTR | ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకున్నారు.అసమర్థత ప్రో మ్యాక్స్, అవినీతి అల్ట్రా మ్యాక్స్, అరాచకం ఐ మ్యాక్స్.. ఆ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. బుధవారం రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై హరీశ్ రావుతో కలిసి తెలంగాణ భవన్లో షార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజా పాలన కాదు వెయ్యి రోజుల శని పాలన అన్నారు. వెయ్యి రోజులుగా ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ఆర్థిక, సామాజిక విధ్వంసం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. ఈ శతాబ్దం అతి పెద్ద మోసం కాగ్రెంస్ మోనిఫెస్టో అని విమర్వచించరు. జల ద్రోహం చేస్తున్న జలగల పాలన అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబుకు చంచాగిరి చేస్తూ గురువుగారికి దక్షిణగా కృష్ణా, గోదావరి నీళ్లు ఇస్తున్నాడు. అందాల పోటీలకు పెట్టిన ఖర్చులో పదో వంతు ఖర్చు చేస్తే కాఫర్ డ్యాం కట్టి నీళ్లు ఇయ్యొచ్చని ఇంజిర్లు చెప్పారు. వారికి బెల్టు ట్రీట్మెంట్ ఉంటుందని భయపెట్టారన్నారు. ఎస్ఎల్బీసీ కుప్పకూల్చినా, చెక్కు డ్యాంలు కూలినా బీజేపీ, ఎన్డీఎస్ఏ నోరు తెరువదు. జీఆర్ఎంబీలో తెలంగాణ ప్రాజెక్టులు రద్దు చేయాలని ఎజెండా పెడితే పారిపోతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు మోచేయి నీళ్లు తాగే అధికారి ఆదిత్య నాద్ దాస్ ను సలహాదా రుగా పెడితే తెలంగాణకు నీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డ భూములను కొల్లగొడుతున్నారు. రూ.50 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని రూ.20 కోట్లతో ముగించారని మండిపడ్డారు. నీళ్లు అడిగితే కోసి రక్తం చల్లమన్నారు. యూరియా అడిగిన రైతులపై లాఠీ చార్జి చేశారు. కాళేశ్వరంపై కక్ష రైతన్నకు శిక్ష, మోటర్లుకు మీటర్లు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు బందు అయింది. రాహుల్ బంధ్ చాలయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగున్నర కోట్ల అప్పు చేశారు. రియల్ ఎస్టేట్ కుప్ప కూలింది. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు.. రాష్ట్ర సంపాదన కోసం మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకున్నారు
అసమర్థత ప్రో మ్యాక్స్,
అవినీతి అల్ట్రా మ్యాక్స్,
అరాచకం ఐ మ్యాక్స్..
ఆ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు– కేటీఆర్ https://t.co/FsnSPkYEe1 pic.twitter.com/sj6dekkC3X
— Telugu Scribe (@TeluguScribe) September 2, 2026