Registration Charges | నెలాఖరులోగా కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు?.. భూముల విలువ 20-40 శాతం పెంపు!
రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూముల విలువ సవరణపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి.
- పూర్తయిన క్షేత్రస్థాయి అధ్యయనం
- ప్రభుత్వ ఆదేశాలు రాగానే పెంపు
Registration Charges | హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భూముల విలువ సవరణపై ఇప్పటికే క్షేత్రస్థాయి అధ్యయనం పూర్తయిందని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం నిర్ణయం తీసుకొని, ఆదేశిస్తే వెంటనే పెంపుదల అమలు చేస్తామని చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా ఆదేశాలు రావొచ్చని, దాదాపు 20-40 శాతం వరకు పెంపుదల ఉండొచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది మే 16న స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. శాఖ ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పెంచాలని స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.18,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకోగా.. రూ.14,295 కోట్లు వచ్చింది. లక్ష్యంలో 77 శాతం మాత్రమే ఆదాయం రావడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
చాలా చోట్ల భూముల మారెట్ విలువకు, క్రయ విక్రయ ధరలకు భారీ తేడా ఉన్నదని, కాబట్టి భూముల విలువ, స్టాంపు డ్యూటీని సవరించాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ధరలను సవరించాలి, వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, ప్లాట్లు, అపార్ట్మెంట్లలో.. వేటికి ఎంత సవరించాలనేది శాస్త్రీయంగా నిర్ధారణ జరగాలని స్పష్టం చేశారు. ఈ మేరకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం జరిపారు. మార్కెట్ విలువకు అనుగుణంగా ఏయే ప్రాంతాల్లో ఎంత మేర పెంచవచ్చో నివేదికలు సిద్ధం చేశారు. ఇతర రాష్ర్టాల్లో పరిస్థితి ఎలా ఉన్నదో అధ్యయనం చేసి రెవెన్యూ శాఖ మంత్రికి వివరాలు అందజేసినట్టు తెలిసింది. వీటిని పరిశీలించిన అనంతరం భూముల విలువను ఎంత మేర సవరించాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నది.
పెంచిన ధరలతోనే.. బడ్జెట్ అంచనాలు?
ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌కు కసరత్తులు ప్రారంభించింది. శాఖల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో స్టాంపులు, రిజిస్ట్రేసన్ల శాఖలో పెంచబోయే ధరలకు అనుగుణంగానే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం రూ.18500 కోట్ల ఆదాయ లక్ష్యం కాగా.. ఈసారి రూ.20-21వేల కోట్ల మధ్యలో అంచనాలు ఉండొచ్చని చెబుతున్నారు. స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా గతేడాదితో పోల్చితే కనీసం 40 శాతం అదనపు ఆదాయం సాధించేలా ప్రణాళికలు రూపొందించినట్టు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

