థియేటర్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలు
సరికొత్త మార్గదర్శకాలు | నైట్ కర్ఫ్యూ అమలు నేపథ్యంలో థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.

హైదరాబాద్ : కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నేటి రాత్రి నుంచి ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో థియేటర్ల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది.
- రాష్ట్రంలోని సినిమా థియేటర్లు (మల్టీపెక్స్లతో సహా) రాత్రి 8 గంటల వరకు మూసివేయాలి.
- థియేటర్లలోని ప్రేక్షకులు, సిబ్బంది, సామగ్రి విక్రయించే వారు విధిగా మాస్కులు ధరించాలి.
- ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలతోపాటు అక్కడక్కడ శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.
- ప్రేక్షకులు భౌతిక దూరం పాటించేలా, రద్దీని నియంత్రించేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలి.
- షో ముగిసిన వెంటనే థియేటర్ పరిసరాలను వెంటనే శానిటైజ్ చేయాలి.
- థియేటర్లలోని ఏసీలు 24-30 డిగ్రీల మధ్య ఉండాలి. తేమశాతం 40 నుంచి 70 శాతం ఉండేలా చూసుకోవాలి.
- లోపల గాలి రీసర్క్యూలేట్ కాకుండా చూడాలి. గాలి దారాళంగా వచ్చిపోయేలా చూసుకోవాలి.
- వేర్వేరు షోల్లోని ప్రేక్షకులను ఒకే సారి ఇంటర్ వెల్‌కు అనుమతించొద్దు.
పై నిబంధనలన్నీ ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 30 వరకు అమలుల్లో ఉంటాయి. నిబంధనలు అతిక్రమించిన వారిపై వ్యాధుల నిర్వహణ చట్టం-2005, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

