Apps:
Follow us on:

Pension | పద్మ అవార్డు గ్రహీతలకు నెలకు రూ.25వేల పెన్షన్‌.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

1/7Pension | తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పద్మ అవార్డు గ్రహీతలకు రూ.25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. దీంతో పాటు ప్రతి నెల రూ.25వేలు పింఛన్‌ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
2/7పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగువారిని తెలంగాణ ప్రభుత్వం ఆదివారం సత్కరించింది. హైదరాబాద్‌ శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్‌ చిరంజీవిని సీఎం రేవంత్‌ రెడ్డి సన్మానించారు.
3/7వీరితో పాటు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన తెలంగాణవాసులు గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమా మహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠాలాచార్యను కూడా సీఎంతో పాటు మంత్రులు సత్కరించారు.
4/7తెలంగాణ నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన ఈ ఐదుగురికి పెన్షన్‌ ఇవ్వనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.
5/7ప్రతిష్ఠాత్మక అవార్డులు గెలుచుకున్న తర్వాత కూడా చాలామంది పద్మ అవార్డు గ్రహీతలు, కళాకారులు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగదు బహుమతి, పెన్షన్‌పై నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
6/7ఇక వెంకయ్య నాయుడు, చిరంజీవి ఏపీ నుంచి పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు.
7/7హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో జరిగిన ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.