హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఫుడ్స్‌లో వినియోగిస్తున్న ముడిసరుకు ధరల సవరణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీతో కలిసి సమీక్ష ని ర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యమైన పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): చేప పిల్లల పంపిణీ తేదీపై గందరగోళం నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి చేప పిల్లల పంపిణీని ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మత్స్యశాఖ మాత్రం ఈ నెల 4వ తేదీ నుంచి పంపిణీ చేయాలని నిర్ణయించడం గమనార్హం. దీంతో జిల్లా అధికారులు, రాజకీయ నేతల్లో గందరగోళం నెలకొన్నది. మరోవైపు కేవలం 9 జిల్లాల్లోనే చేప పిల్లల పంపిణీకి మత్స్యశాఖ చర్యలు చేపట్టింది. ఆ తర్వాత 19 జిల్లాల్లో చేపట్టనుంది.