తెలంగాణకు హరితహారం ఎఫెక్ట్.. పెరిగిన వృక్ష, జంతు సంపద.. ఫోటోలు
హరిత హారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8260 కోట్లతో 241.5 కోట్ల మొక్కలను నాటారు. 10.3 లక్షల ఎకరాల అడవిని
తెలంగాణ ప్రభుత్వం చెట్లను పరిరక్షించడం కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోంది. ప్రకృతిని పెంపొందించాలన్నా.. అడవులు పెంచాలన్నా.. వృక్ష సంపద.. జంతు సంపద పెరగాలన్నా ఖచ్చితంగా చెట్లను ఎక్కువగా పెంచాలి. అందుకే.. తెలంగాణకు హరిత హారం అనే ప్రోగ్రామ్ ద్వారా గత కొన్నేళ్లలో తెలంగాణలో ఇప్పటి వరకు 632 చదరపు కిలోమీటర్ల పరిధిలో అడవులు పెరిగాయి.

దానికి ఉదాహరణే ఈ ఫోటోలు. వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫర్ మున్నా మందాలపు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వృక్ష, జంతు సంపదను అడవుల్లో తిరిగి మరీ క్లిక్‌మనిపించారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి తెలంగాణ అడవుల్లో తచ్చాడుతున్న అరుదైన పక్షులు, జంతువుల ఫోటోలను క్లిక్‌మనిపించారు.

హరిత హారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ.8260 కోట్లతో 241.5 కోట్ల మొక్కలను నాటారు. 10.3 లక్షల ఎకరాల అడవిని పునరుద్ధరించారు. ఇప్పటికే మున్నా.. అరుదైన జాతికి చెందిన ఎన్నో పక్షలు ఫోటోలను తీశారు. గత సంవత్సరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో బొనెల్లి జాతికి చెందిన గద్ద ఫోటోను క్లిక్‌మనిపించారు.

దాని లైఫ్ సైకిల్‌పై డాక్యుమెంటరీ కూడా తీశారు. వరంగల్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకాల్ వైల్డ్‌లైఫ్ సాంక్షువరీలో డస్కీ జాతికి చెందిన గుడ్లగూబ ఫోటో తీశారు. తెలంగాణకు వలస వచ్చిన పక్షి అది. నార్త్, నార్త్ ఈస్ట్‌లో ఈ జాతి పక్షులు ఎక్కువగా ఉంటాయి. అలా.. తన కెమెరాలో చాలా అరుదైన జాతికి చెందిన పక్షులను మున్నా ఫోటోలు తీశారు. వాటిలో కొన్నింటిపై ఓ లుక్కేయండి.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

