హైదరాబాద్ : ప్రభుత్వ శాఖల, ప్రభుత్వ రంగ సంస్థల బ్యాంకు ఖాతాల నిర్వహణపై రాష్ట్ర ఆర్థికశాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రభుత్వం ఎంప్యానెల్ చేసిన బ్యాంకుల్లోనే ఖాతాలు ఉండాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు, ఎఫ్డీలకు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేసింది. ముందస్తు అనుమతితోనే బ్యాంకు ఖాతాలు, ఎఫ్డీ ఖాతాలు తెరవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఎఫ్డీలు చేసేందుకు వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతమున్న ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలను ఆర్థికశాఖ పరిశీలించనుంది. ప్రస్తుత ఎఫ్డీలనూ ఎంప్యానెల్ చేసిన బ్యాంకులో ఒకే ఖాతాగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బ్యాంకు ఖాతాలు, ఎఫ్డీల వివరాలు మార్చి 10 లోపు ఇవ్వాలని.. అన్ని రకాల ఖాతాలను పూర్తిగా పర్యవేక్షించాలని అధికారులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.