హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల సంక్షేమం, పెండింగ్ సమస్యలు, న్యాయమైన హక్కుల సాధన కోసం జేఏసీ పిలుపుమేరకు ఈ నెల 27న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ పేరుతో నిరసనలు తెలుపునున్నట్టు తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ(టీజీఈజేఏసీ) చైర్మన్ విక్రమ్‌కుమార్, కన్వీనర్ ఎంబీ కృష్ణయాదవ్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు.
కొత్త పీఆర్సీ తక్షణ అమలు, ఆరు నెలల డీఏ విడుదల, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, ఈహెచ్ఎస్ పూర్తిస్థాయి అమలు, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చలు జరుపడంతోపాటు జీవో 25 సవరణ, జీవో 190 అమలుపై ప్రభు త్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో టీజీవో అసోసియేట్ ప్రెసిడెంట్ ఆశన్న, ఎన్జీవో జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, నా ల్గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ, పాల్గొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో 732 ఫార్మాసిస్టు పోస్టులను వెంటనే భర్తీ చేయాలని పలువురు అభ్యర్థులు సోమవారం ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రవ్యాప్తంగా 732 పోస్టులకు ఎంహెచ్ఎస్ఆర్బీ 2024 సెప్టెంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చి, నవంబర్ 30న సీబీటీ పద్ధతిలో పరీక్ష నిర్వహించిందని తెలిపారు. డిసెంబర్ 3న ప్రిలిమినరీ కీ, మే 12న ఫైనల్ కీ ఫలితాలు వెల్లడించింది.
రెండేండ్లు గడుస్తున్నా.. ప్రొవిజనల్ మె రిట్ లిస్టును విడుదల చేయడం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు.. ఆరోగ్యశాఖ మంత్రి, వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎంహెచ్ఎస్ఆర్బీ అధికారుల దృ ష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు అందజేశామని, అయినా ఎలాంటి ఫలితం లేదని అభ్యర్థులు వాపోతున్నారు. వీలైనంత త్వరగా పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.