KTR | హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేశ్ మాణిక్య విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు హాజరైన సమయంలో ముసుగులు ధరించిన కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు తమపై దాడికి యత్నించారు. ఎస్సై సమక్షంలో ఈ దాడి జరగడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ బయటపెట్టాలని బీఆర్ఎస్ లీగల్ సెల్ డిమాండ్ చేయగా.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు చెప్పారు. దీంతో వివాదం కాస్త ముదిరింది.
ఇటీవల అసెంబ్లీ గేట్ నంబర్-3 వద్ద జరిగిన ఆందోళనలకు సంబంధించి మహేందర్ రెడ్డి, మహేష్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా వారిద్దరూ మంగళవారం విచారణకు హాజరయ్యారు. అదే సమయంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 15 మంది దుండగులు కేటీఆర్ పీఏ, పీఆర్వోపై దాడి చేశారు. అయితే బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు తిరగబడటంతో వారు అక్కడ నుంచి పారిపోయారు. కాగా, ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని వారు అడగ్గా.. సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీసులు తెలిపారు. దీనిపై కేటీఆర్ సిబ్బందితో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో కుట్ర కోణం లేకపోతే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ముగిసిన కేటీఆర్ సిబ్బంది విచారణ
41 సీఆర్పీసీ కింద ఇరువురికి నోటీసులు జారీ, పోలీసులు ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తామని తెలిపిన పీఏ, పీఆర్వో
తమపై జరిగిన దాడి పట్ల పోలీసులకు ఫిర్యాదు చేసిన కేటీఆర్ పీఏ మహేందర్, పీఆర్వో మహేష్
దాడికి సంబంధించిన సీసీటీవీ… https://t.co/0nb9mlbKhs pic.twitter.com/3jGGMlMmFf
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2026
పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగులు ధరించిన వ్యక్తులు ప్రవేశించి దాడికి యత్నించినా పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు. పోలీస్‌స్టేషన్‌లోకి ఎస్‌హెచ్‌వో ప్రమేయం లేకుండా గుర్తుతెలియని వ్యక్తులు ఎలా వస్తారని ప్రశ్నించారు.
‘‘పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది. పోలీస్‌స్టేషన్‌లోకి 15 మంది దుండగులు మాస్క్‌లు వేసుకొని వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగితే పోలీస్‌స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వమే దగ్గరుండి పోలీస్‌స్టేషన్‌లో దాడి చేయించేందుకు ప్రయత్నించింది’’ అని జక్కుల లక్ష్మణ్ ఆరోపించారు.
సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సమక్షంలోనే కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి, పీఆర్వో మహేష్‌పై 30 మంది మాస్కులు ధరించి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసే ప్రయత్నం చేశారు
పోలీస్ స్టేషన్లోకి SHO ప్రమేయం లేకుండా గుర్తు తెలియని వ్యక్తులు ఎలా వస్తారు?
పండగరోజు వాళ్ల కుటుంబ సభ్యులతో పండుగ… https://t.co/CULPJgXIX4 pic.twitter.com/ssAJEfQNrL
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2026
కేటీఆర్ సిబ్బందిపై దాడి యత్నం జరిగిందన్న నేపథ్యంలో పోలీస స్టేషన్‌కు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తులు భారీగా తరలివచ్చారు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్టేషన్ ఎదుట ఆందోన చేపట్టారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు కల్యాణ్ రావు, భాస్కర్ గౌడ్, హరీష్, కార్తీక్, సాయినాథ్తో పాటు పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్న న్యాయవాదుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, వారిని ఈడ్చివేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిలో కొంతమందిని గోల్కొండ, మరికొంతమందిని శంషాబాద్ తదితర పోలీస్స్టేషన్లకు తరలించినట్లు సమాచారం.
పోలీస్ డిపార్ట్మెంట్ ఫెయిల్ అయింది
పోలీస్ స్టేషన్ లోపలికి 15 మంది దుండగులు మాస్క్‌లు వేసుకొని వెళ్తే కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడిగితే పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఇవ్వడం లేదు
ప్రభుత్వమే దగ్గరుండి పోలీస్ స్టేషన్ లోపల దాడి చేయించేందుకు… https://t.co/pOyPWb8t88 pic.twitter.com/Wb0SbYpP4p
— Telugu Scribe (@TeluguScribe) September 14, 2026