కరీంనగర్ రాంనగర్, డిసెంబర్ 22 : చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. కరీంనగర్ కమిషనరేట్‌లో ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన భరోసా కేంద్రాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. సినీ ప్రముఖులు అల్లు అర్జున్, మోహన్‌బాబు విషయాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని తెలిపారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. లైంగిక వేధింపులకు గురైన, అసభ్యకరమైన ప్రవర్తనకు లోనైన పిల్లలకు సురక్షితమైన వాతావరణంలో చే యూత అందించేందుకే పోలీసుశాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కమిషనరేట్లు, జిల్లాల్లో భరోసా కేంద్రాలను ఏర్పా టు చేస్తున్నదని తెలిపారు. లైంగిక వేధింపుల కేసుల్లో శిక్షల శాతం పెరిగిందని చెప్పారు.