హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా విరాజిల్లుతున్నాయి. ప్రతిఏటా ఎన్నో దేశాల్లో బతుకమ్మ సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. అయితే.. సౌదీ అరేబియాలో తొలిసారిగా అక్కడి ఇండియా ఎంబసీ ఆధ్వర్యంలో ‘ప్రవాసి పరిచయ్’ పేరిట తెలంగాణ డేను నిర్వహించారు.
బతుకమ్మ, పాలపిట్ట, జింక, కోయబొమ్మలు, చార్మినార్, కాకతీయ కళాతోరణం, మేడారం సమ్మక్క-సారలమ్మ, బోనాలు తదితర వేడుకల నిర్వహణ, నమూనాలను ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమ ఫొటోలు, వీడియోను ‘వినయ్ చేగూరి’ ట్వీట్(ఎక్స్) చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఆ ట్వీట్‌ను ట్యాగ్ చేశారు.