కరోనా వ్యాక్సినేషన్లో తెలంగాణ మరో మైలురాయి
Corona vaccination | రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది.

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ మరో మైలురాయిని అధిగమించింది. గురువారం ఉదయం వరకు కరోనా వ్యాక్సినేషన్ 4 కోట్ల మార్కును దాటింది. ఇప్పటివరకు అర్హులైన 95 శాతం మందికి మొదటి డోసు పంపిణీ చేశారు. రెండో డోసు 50 శాతం పూర్తయిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమయింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. వ్యాక్సినేషన్ మరో 78 రోజుల్లోనే రెండు కోట్ల మార్కును చేరింది. ఇక కేవలం 27 రోజుల్లోనే అంటే అక్టోబర్ 23 నాటికి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపిణీ చేశారు. నాలుగు కోట్ల మైళురాయిని దాటడానికి మరో 45 రోజుల సమయం పట్టింది. కాగా, అర్హులైనవారిలో ఇప్పటివరకు 18 లక్షల మంది వ్యాక్సిన్ తీసుకోలేదని సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

