Hyderabad | ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే.. ఇక తెలంగాణకు శాశ్వత రాజధానిగా హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్తయ్యాయి.
- ఆంధ్రప్రదేశ్‌తో తెగిన ‘ఉమ్మడి’ బంధం
- పదేండ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు
- వీడిన కొన్ని విభజనచట్టంలోని చిక్కుముడులు
Hyderabad | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్‌తో తెలంగాణకు ఉన్న ఉమ్మడి రాజధాని బంధం తెగిపోయింది. పదేండ్ల ఉమ్మడి కథ ముగిసింది. జూన్ 2న తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. రాష్ట్రం విభజన జరిగి శనివారానికి పదేండ్లు పూర్తయ్యాయి. దీంతో ఉమ్మడి రాష్ట్రం కథకు శాశ్వత ముగింపు పడింది. రాష్ట్ర విభజన చట్టంలో హైదరాబాద్‌ను తెలంగాణకు శాశ్వత రాజధానిగా, ఏపీ రాష్ర్టానికి పదేండ్ల పాటు తాత్కాలిక, ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజాగా ఈ గడువు శనివారంతో ముగిసింది. ఇక నుంచి హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా కొనసాగనున్నది. విభజన చట్టం సెక్షన్-8 ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రాంతంలో పౌరుల రక్షణ బాధ్యతను గవర్నర్‌కు అప్పగించారు. దీంతోపాటు, ఉమ్మడి రాజధానిలో నివసించే ప్రజల ప్రాణ, ఆస్తి, రక్షణ భద్రతలను కాపాడే బాధ్యతలను గవర్నర్ చేతికిచ్చారు.
తాజాగా ఈ గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వ చేతికి ఈ బాధ్యత అందుతుంది. ఇప్పటికే అత్యంత కీలకమైన ఉమ్మడి హైకోర్టు విభజన సమస్య గతంలోనే పరిష్కారమైంది. 2018 డిసెంబర్ 18న నోటిఫికేషన్ విడుదలై, 2019 జనవరి 1న ఏపీ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటైంది. ఢిల్లీలోని ఉమ్మడిభవన్ విభజన పూర్తయింది. ఏపీ, తెలంగాణ భవన్‌కు స్థలాలను కేటాయించారు.
విద్యావకాశాలు ఈ ఒక్క ఏడే..
సెక్షన్-95 ప్రకారం విద్యార్థులకు పదేండ్ల పాటు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించారు. ఆర్టికల్ -317 డీ ప్రకారం అడ్మిషన్ల కోటా పదేండ్ల వరకు కొనసాగించాలి. ఎప్‌సెట్ సహా 7 రకాల ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు జూన్ 2కు ముందే విడుదల కావటంతో అవకాశాలు కల్పించాల్సి వచ్చింది. ఈ ఒక్క సంవత్సరం ఏపీ విద్యార్థులకు తెలంగాణలో సీట్లు కేటాయిస్తారు. 15 శాతం ఓపెన్కోటాలో మెరిట్లో ఏపీ వాళ్లతో పాటు, తెలంగాణ విద్యార్థులు సీట్లను దక్కించుకునే అవకాశం ఉన్నది.
ఇంకా అపరిష్కృతంగానే..
ఇదిలా ఉంటే అనేక సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా, గోదావరి జలాల పంపిణీ గుదిబండగా మారింది. అపెక్స్ కమిటీలు, నదీ యాజమాన్య బోర్డుల మధ్యే నలుగుతున్నది. దీనిపై కేంద్రం ఎటూ తేల్చటం లేదు. రాష్ట్ర విభజన చట్టం తొమ్మిదో షెడ్యూల్లోని ప్రభుత్వ సంస్థలు, పదో షెడ్యూల్లోని సంస్థల విభజన తేలలేదు. 68 సంస్థల విభజనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలంగాణ తెలిపింది.
ఏపీ ముందుకురాకపోవటంతో వీటి విభజన పూర్తికాలేదు. ఆస్తుల పంపిణీ వివాదాలు, ప్రభుత్వ కార్యాలయాల స్వాధీనం ఇంకా జరగలేదు. స్థానికత ఆధారంగా ఉద్యోగులను కేటాయించాలని ఉద్యోగసంఘాలు కోరినా ఇప్పటి వరకు ఫలితం లేకుండా పోయింది. తెలంగాణకు ప్రయోజనం చేకూర్చాలని పదేండ్ల బీఆర్ఎస్ సర్కారు కాళ్లరిగేలా తిరిగినా కేంద్రం కనికరించలేదు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను గాలికొదిలేసింది. కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. జాతీయ ప్రాజెక్ట్ కేటాయింపు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, అసెంబ్లీ స్థానాల పెంపును పక్కనపెట్టేసింది. పదేండ్ల పోరాటం తర్వా త గిరిజన వర్సిటీని ఏర్పాటు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

