డీహెచ్‌లో అవినీతిపై సీఎంవో ఫోకస్!
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కీలకమైన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) అధికారులు మరోసారి విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సరెండర్ అయి డిప్యుటేషన్లు పొందిన అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫైళ్లను సీఎంవో అధికారులు బుధవారం క్షుణ్ణంగా పరిశీలించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
- మరోసారి విచారణకు రానున్న అధికారులు
- సరెండరై డిప్యుటేషన్ ఫైళ్లపై విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో కీలకమైన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) విభాగంలో ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) అధికారులు మరోసారి విచారణ చేపట్టనున్నట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సరెండర్ అయి డిప్యుటేషన్లు పొందిన అధికారులు, సిబ్బందికి సంబంధించిన ఫైళ్లను సీఎంవో అధికారులు బుధవారం క్షుణ్ణంగా పరిశీలించనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఓసారి డీహెచ్‌లో విచారణ చేపట్టిన సీఎంవో అధికారులు కీలకాధికారి వద్ద కూర్చుని ప్రశ్నలవర్షం కురిపించినట్టు సమాచారం. పలు ఫైళ్లను తెప్పించుకుని ఆయా విభాగాల్లో దస్ర్తాలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయని ప్రశ్నించినట్టు తెలిసింది. విజిలెన్స్ ఫైళ్లు, నర్సింగ్ ఉద్యోగాల్లో చేరిన సిబ్బంది రెగ్యులరైజేషన్‌కు సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేయకుండా ఆపడం వంటి వాటిపై విచారణ జరిపినట్టు సమాచారం.
మెమోలు జారీ అయినా..
డీహెచ్‌లో కీలకాధికారిసహా ఆయా విభాగాల అధికారులపై కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఈ విభాగంలో కీలకాధికారి సహా మరో ఏడుగురికి ప్రభుత్వం మెమోలు జారీ చేసింది. వీరి అవినీతి బాగోతంపై విచారణ జరిపేందుకు అదే శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారిని ప్రభుత్వం నియమించింది. అయితే సదరు అధికారి బదిలీపై వెళ్లడంతో ఆ ఫైలు పెండింగ్‌లో పడిపోయింది. ఇదే అదునుగా డీహెచ్‌లో గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు యథేచ్ఛగా అవినీతికి తెర లేపడంతో ‘నమస్తే తెలంగాణ’ పలు కథనాలను ప్రచురించింది. ఏవో ఉద్యోగోన్నతుల్లో వసూళ్ల దందాపై వైద్యారోగ్యశాఖకు అందిన ఫిర్యాదుతోపాటు విజిలెన్స్ ఫైళ్లు క్లియర్ చేస్తూ లక్షల్లో దండుకున్న వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇద్దరు షాడోలను నియమించుకుని సాగించిన దందాపై వరుస కథనాలు ప్రచురించింది. ‘నమస్తే తెలంగాణ’తో పాటు పలు మీడియా సంస్థల కథనాల ఆధారంగా సీఎంవో అధికారులు ఈ విచారణ చేపట్టినట్టు తెలిసింది. అయితే ఈ అవినీతి వ్యవహారంలో కీలకంగా ఉన్న ఇద్దరు అధికారులపై ఇప్పటికే వేటు పడగా.. విజిలెన్స్ విభాగంలో చక్రం తిప్పుతున్న ఓ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. మరోవైపు డీహెచ్‌లో ఈ అవినీతి దందాలకు కేంద్ర బిందువుగా ఉన్న కీలకాధికారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

